సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 16:38:27

సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు నగరంలోని ఎల్బీస్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహణ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను టీఆర్‌ఎస్‌ నేతలు నేడు పరిశీలించారు. సభా ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఆ పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ ఎల్బీస్టేడియంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో సభా ప్రాంగణంలో శానిటైజ్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. సభకు వచ్చే ప్రజలు కరోనా నిబంధనలు పాటించాల్సిందిగా కోరారు. ట్యాంక్‌ బండ్‌ నుంచి వచ్చేవాళ్లు గేట్‌-జీ ద్వారా, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే వాళ్లు గేట్‌-ఏ ద్వారా, ముషీరాబాద్‌, అంబర్‌పేట నుంచి వచ్చే వాళ్లకు గేట్‌-ఎఫ్‌ ద్వారా లోపలికి రావాల్సిందిగా సూచించారు. స్టేడియం వెలుపల ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.