సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 16:47:01

సీఎం కేసీఆర్ ఆస్తులు ఆన్‌లైన్‌లో న‌మోదు

సీఎం కేసీఆర్ ఆస్తులు ఆన్‌లైన్‌లో న‌మోదు

సిద్దిపేట : ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కుటుంబ ఆస్తి వివ‌రాలు ఆన్‌లైన్‌లో న‌మోదు అయ్యాయి. మ‌ర్కుక్ మండ‌లంలోని ఎర్ర‌వ‌ల్లిలోని త‌న నివాస గృహానికి వ‌చ్చిన‌ గ్రామ కార్య‌ద‌ర్శి సిద్దేశ్వ‌ర్‌కు సాధార‌ణ పౌరుడి మాదిరిగానే సీఎం కేసీఆర్‌ త‌న కుటుంబం ఆస్తుల వివ‌రాల‌ను తెలియ‌జేశారు. సీఎం కేసీఆర్ నివాస గృహాల వివ‌రాల‌ను తెలంగాణ వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల న‌మోదు యాప్‌లో గ్రామ కార్య‌ద‌ర్శి న‌మోదు చేశారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రామీణ‌, పుర ప్ర‌జ‌లు త‌మ స్థిరాస్తుల వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని సీఎం సూచించారు. ఆస్తుల‌పై ప్ర‌జ‌ల‌కు హ‌క్కు, భ‌ద్ర‌త క‌ల్పించేందుకు వివ‌రాలను న‌మోదు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి కుటుంబం స్థిరాస్తుల వివ‌రాల‌ను విధిగా న‌మోదు చేసుకోవాల‌న్నారు. ఆస్తుల న‌మోదు అనేది దేశంలోనే మొట్ట‌మొద‌టి అతి పెద్ద ప్ర‌య‌త్న‌మ‌ని చెప్పారు. సాగు భూముల త‌ర‌హాలోనే వ్య‌వ‌సాయేత‌ర భూముల‌కు ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాలు ఇస్తామ‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన స్థిరాస్తుల న‌మోదు ప్ర‌క్రియ చ‌రిత్ర‌లో మైలురాయిగా నిలుస్తుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు.


logo