మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 19, 2020 , 21:17:43

స్విగ్గీ, జొమాటో సేవలకు అనుమతి లేదు: సీఎం కేసీఆర్‌

స్విగ్గీ, జొమాటో సేవలకు అనుమతి లేదు: సీఎం కేసీఆర్‌

 హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో సేవలకు తెలంగాణలో అనుమతి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి మే 7 వరకు అన్ని ఫుడ్‌డెలివరీ సంస్థలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఇవాళ కేబినెట్‌ సమావేశం   అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. 

'ఈ 15 రోజులు బయటి పదార్థాలు(ఫుడ్‌) జోలికి వెళ్లకండి. ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు. ఎలాంటి పండగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలి. రంజాన్‌ మాసం అయినప్పటికీ ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. అన్ని మతాల్లో సామూహిక కార్యక్రమాలు, ప్రార్థనలకు అనుమతి లేదు.  ఇప్పటి వరకు ప్రజలు మంచి సహకారం అందించారు. శానిటైజేషన్‌, పారిశుద్ధ్యం పనులు బాగా జరుగుతున్నాయి. గ్రామాల నుంచి పట్టణాల దాకా ఎవరికి వారు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని' సీఎం చెప్పారు. logo