బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 22:56:07

వైరస్‌ను ఎదుర్కోనేందుకు సర్వంసిద్దం: సీఎం కేసీఆర్‌

వైరస్‌ను ఎదుర్కోనేందుకు సర్వంసిద్దం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌:  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వైరస్‌ను ఎదుర్కోవడానికి సర్వ సన్నద్దంగా ఉందని. ప్రాథమికంగా దీని కోసం రూ.500 కోట్లు కేటాయిస్తు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి. విమానాశ్రయంలో సర్వైలెన్స్‌ ఏర్పాటు చేశాం. 200 మంది ఆరోగ్యశాఖకు చెందిన సిబ్బంది విదేశాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు సిద్ధం కావడం సాధ్యం కాదు కాబట్టి అన్ని జిల్లాల్లో ఐసోలేటెడ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. 321 ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ బెడ్స్‌ కూడా సిద్ధంగా ఉంచాం. 240 వెంటిలేటర్స్‌  సిద్దంగా ఉన్నాయి.రాష్ట్రంలో 4 క్వారంటైస్‌ ఫెసిలిటీస్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌శాఖల అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. 


logo