సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 22:42:31

పెండ్లీలకు బంధువులను తక్కువగా పిలవండి.. సీఎం కేసీఆర్‌

పెండ్లీలకు బంధువులను తక్కువగా పిలవండి.. సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: జనం ఎక్కవ గుమికూడేది పెండ్లీలు, ఫంక్షన్లలోనే. మ్యారేజ్‌ హాల్స్‌ అన్ని మూసివేయాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే నిర్ణయించబడ్డ పెండ్లీలు చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. బంధువులను మాత్రం 200 లోపు ఉండేలా నియంత్రించుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తరువాత జరగబోయే పెండ్లీలకు మాత్రం ఫంక్షన్‌ హాల్స్‌ బుకింగ్‌ ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వాటి అనుమతులు రద్దు చేస్తామన్నారు.  వీటిని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీలకు, కలెక్టర్లకు అధికారాలు ఇచ్చామన్నారు.


logo