గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 22:36:35

మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసివేత

మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసివేత

మార్చి 31వ తేదీ వరకు జనసామర్థ్యం ఎక్కువ ఉండకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా అన్ని రకాల విద్యాసంస్థలు, ప్రైమరీ స్కూల్స్‌ టూ యూనివర్సిటీ వరకు మూసివేయాలని నిర్ణయించాం. ఎవ్వరు కూడా ఈ నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. సెలవులు ఇవ్వకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తే వాటి అనుమతులు వాటి రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ సోషల్‌ వెల్‌ఫేర్‌ హాస్టల్స్‌లో, కాలేజీ హాస్టల్స్‌ ఉంటున్న పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు వసతి ఉంటుంది. మిగితా విద్యార్థులను ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ప్రత్యేక సానిటరీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఆదేశించాం.   ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైన పదోతరగతి పరీక్షలు, ఇప్పుడు నడుస్తున్న ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తాయని తెలిపారు. 


logo
>>>>>>