బుధవారం 03 జూన్ 2020
Telangana - May 18, 2020 , 20:41:20

మన 'సోనా'కు షుగర్‌ ఫ్రీ రైస్‌ అని పేరు: సీఎం కేసీఆర్‌

మన 'సోనా'కు షుగర్‌ ఫ్రీ రైస్‌ అని పేరు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: ఏ పంటను ఎలా..ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వరిలో ఏఏ రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు.  వర్షాకాలంలో మక్క పంట వేయవద్దు..బదులుగా కందులు వేయాలని సూచించారు.

'తెలంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. తెలంగాణ సోనాకు షుగర్‌ ఫ్రీ రైస్‌ అని పేరుంది.  యాసంగిలో మక్కలు పండించాలి. సన్న రకాల్లో తెలంగాణ సోనా మంచిది.     40 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేద్దాం. 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలి. నిజామాబాద్‌, జగిత్యాలలో పసుపు పంట వేసుకోవచ్చు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో సోయాబిన్‌ వేసుకోవచ్చు. వరి పంటలో తెలంగాణ సోనా రకం   పండించాలని' సీఎం పేర్కొన్నారు.

'ప్రభుత్వం చెప్పే పంటలు రైతులతో వేయించే బాధ్యత కలెక్టర్లదే. త్వరలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుతం 25 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు అందుబాటులో ఉన్నాయి.  త్వరలో న్యూస్‌ ఛానల్‌ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడుతా. తెలంగాణ పంటలన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యే రోజు రావాలని' సీఎం కేసీఆర్‌ కోరారు. 


logo