గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 16:43:18

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌: సీఎం కేసీఆర్‌

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: 'ప్రతిపక్షాలు సబబుగా మాట్లాడితే సబబైన సమాధానమే వస్తుంది. రాజకీయంగా మాట్లాడితే రాజకీయ సమాధానమే వస్తది. ఏదో ఒక గ్రామానికి మారుమూల గ్రామానికి నీళ్లు రాకుంటే మొత్తం భగీరథ దండుగ అన్నట్లు మాట్లాడటం సరికాదు. సభలో హుందాగా మాట్లాడాలి' అని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. 

 అనేక రంగాల్లో అభివృద్ధి ప్రజల కళ్లముందు కనిపిస్తోంది. కాకతీయ కాల్వలు సజీవంగా పారుతుంటే జనాలకు కనిపిస్తోంది. కానీ, కాంగ్రెస్‌ నాయకులకు కనిపించడం లేదు. అనేక రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌.కాగ్‌ ఇచ్చిన లెక్కలనే మేం శాసనసభలో సమర్పించాం. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో పెన్షన్లది ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌ రూ.200 ఇచ్చేవారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్‌ రూ.వెయ్యి చేశాం. ప్రస్తుతం పింఛన్‌ వంద శాతం పెంచి రూ.2016 చేశాం.  రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నాం.  తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.5లక్షల కోట్లలోపు ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.9లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రాజెక్టులకు డీపీఆర్‌ కావాలని విపక్షాలు అడుగుతున్నాయి. ప్రాజెక్టులకు బహిరంగంగా టెండర్లు పిలుస్తున్నామని సీఎం వివరించారు. logo