శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 10:58:59

పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్‌ నివాళి

పీవీ నరసింహారావుకు సీఎం కేసీఆర్‌ నివాళి

హైదరాబాద్‌ : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల పీవీ జ్ఞానభూమిలో పుష్పాంజలి సమర్పించి సీఎం నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పీవీ కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నేతలు, తదితర నేతలు హాజరయ్యారు. పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఏడాది పొడవునా పీవీ జయంతి వేడుకలు జరగనున్నాయి. పీవీ జ్ఞానభూమిలో సర్వమత ప్రార్థనలను నిర్వహించారు.logo