శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:59:07

7 రోజులు.. నిత్యం 12 గంటలు

7 రోజులు.. నిత్యం 12 గంటలు

  • చట్టం తయారీపై సీఎం ప్రత్యేక శ్రద్ధ
  • జనహితమే అభిమతంగా అహోరాత్రులు శ్రమ
  • స్వయంగా బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులకు ఇబ్బందులులేని కొత్త చట్టం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అహోరాత్రులు శ్రమించారు. ఉద్యమకాలం నుంచే వీఆర్వోలు రైతులను వేధిస్తున్న సంఘటనలను ప్రత్యక్షంగా చూశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా పర్యటనలకు వెళ్లిన సమ యంలోనూ ఇవే ఫిర్యాదులు అందాయి. అన్ని వర్గాల ఫిర్యాదులను సీఎం కేసీఆర్‌ పరిగణలోకి తీసుకున్నారు. 2017లో భూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వంద రోజుల్లో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. 2018 ఎన్నికల సమయంలో రెవెన్యూ అధికారుల తీరును కేసీఆర్‌ బహిరంగంగానే విమర్శించారు. అధికారుల ఆగడాలను అరికట్టడానికి నూతన చట్టం తీసుకువస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో ‘నమస్తే తెలంగాణ’లో రెవెన్యూ అధికారుల అవినీతిపై ‘ధర్మగంట’ శీర్షికన వచ్చిన కథనాలను సీఎం కేసీఆర్‌ ప్రత్యక్షంగా చదివారు. రెవెన్యూలో అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే నూతన చట్టమే ఏకైక మార్గమన్న నిర్ణయానికి వచ్చారు.

అధ్యయనం.. చర్చలు

వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న రెవెన్యూ చట్టాలు, వాద్వా కమిటీ సిఫార్సులను సీఎం కేసీఆర్‌ అధ్యయనం చేశారు. వివిధ దేశాల్లో అమలులో ఉన్న బెస్ట్‌ భూ చట్టాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మతో పరిశీలన చేయించారు. అనేకమంది రిటై ర్డ్‌, ప్రస్తుత రెవెన్యూ అధికారులు, భూ పరిపాల నా రంగంలో అపార అనుభవమున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో నిత్యం చర్చలు జరిపిన మీదట తొలి కార్యక్రమంగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టారు. ఆ రికార్డులను కంప్యూటరీకరణ చేయించారు. ధరణి వెబ్‌సైట్‌ రూపుదిద్దుకున్నది. రైతులకు భూ సమస్యల బాధలు తీరాలంటే కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ రావాలని తలంచారు. ఇందుకోసం సాంకేతికంగా రెవెన్యూశాఖను బలోపేతం చేశారు. ఇదే సమయంలో కొంతమంది రైతులతో సీఎం కేసీఆర్‌ స్వయంగా మాట్లాడారు. చాలామంది రైతులు వీఆర్వోల అవినీతి పరాకాష్టకు చేరిందని, ఆ వ్యవస్తే ఉండొద్దని చెప్పారు. 

రోజుకు 12 గంటలకుపైగా కసరత్తు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టా న్ని వెంటనే తీసుకురావాలని, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు చట్టం ఏవిధంగా ఉండాలో నిర్దేశించారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు శివశంకర్‌, వెంకటేశ్వర్‌రావు, సుందర్‌ ఆప్నార్‌, రఫత్‌ అలీ, వెంకటేశం తదితరులు ఏకధాటిగా కసరత్తు చేశారు.

ప్రతి అక్షరం.. ప్రతి పదం..

చట్టం కూర్పుపై సీఎంతోపాటు ఉన్నతాధికారులందరూ దాదాపు మూణ్నాలుగు నెలలు తీవ్ర కసరత్తు చేశారు. వారం రోజులుగా రోజుకు 12 గంటలకుపైగా సీఎం చర్చిస్తూనే ఉన్నారు. ఉద యం 11 గంటలకు చర్చలు ప్రారంభమైతే.. రాత్రి 11 గంటల వరకు కూడా కొత్త చట్టం రూపకల్పనలో తలమునకలయ్యారు. ఏ సెక్షన్‌లో ఏం ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ చెబుతుంటే అధికారులు ఆ విధంగా డ్రాఫ్ట్‌ రూపొందించారు. 

అధికారాలా.. బాధ్యతలా..

క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు అధికారాలు ఇవ్వాలా... లేక బాధ్యతలే ఇవ్వాలా అనే విషయమై లోతుగా చర్చ జరిగింది. అధికారాలు ఇస్తే.. క్షేత్రస్థాయిలో దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే బాధ్యతలు మాత్రమే అప్పగిద్దామనే నిర్ణయానికి వచ్చారు. 

శల్య పరీక్ష చేశారు

సీఎం కసరత్తులో నేను స్వయంగా పాల్గొన్నాను. ఆయన దృష్టి యావ త్తూ.. సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దనే. చట్టంలోని ప్రతి అక్షరం, పదం, వాక్యాన్ని శల్య పరీక్ష చేశారు. అది లాభమా.. నష్టమా అనేది చర్చించేవారు. 

-మాడభూషి శ్రీధర్‌, న్యాయ నిపుణులు  


logo