మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 15:18:19

ఎమ్మెల్యే సోలిపేట భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

ఎమ్మెల్యే సోలిపేట భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

సిద్దిపేట : జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకొని ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతికకాయానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సీఎం కన్నీటి పర్యంతమైయ్యారు. సోలిపేట కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం తొలి నాళ్ల నుంచి నేటి వరకు రామలింగారెడ్డి కేసీఆర్ వెంట నడిచారు. అలాగే సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లు తన నియోజకవర్గంలో పేదలకు అందేలా సోలిపేట ఎంతో కృషి చేశారు. మరికాసేపట్లో రామలింగారెడ్డి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.logo