గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 11:10:09

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ వ‌ర్ధంతి.. సీఎం కేసీఆర్ నివాళి

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ వ‌ర్ధంతి.. సీఎం కేసీఆర్ నివాళి

హైద‌రాబాద్ : స‌్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 8వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గుర్తు చేసుకున్నారు. బాపూజీ క్విట్ ఇండియా, ముల్కీ వ్య‌తిరేక ఉద్య‌మంతో పాటు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించారు అని సీఎం పేర్కొన్నారు. ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అందించిన సేవ‌లు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, నిరంజ‌న్ రెడ్డి కూడా కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. తెలంగాణ ఉద్య‌మంలో బాపూజీ సేవ‌ల‌ను మంత్రులు గుర్తు చేసుకున్నారు.


logo