శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 15:19:57

కాళోజీ ప్ర‌జ‌ల గొంతుక : సీఎం కేసీఆర్

కాళోజీ ప్ర‌జ‌ల గొంతుక : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కాళోజీ సేవ‌ల‌ను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జీవితాంతం ప్రజల గొంతుకగా బతికిన  కాళోజి నారాయణ రావు ఎప్పటికీ స్మరణీయుడే అని సీఎం అన్నారు. తన మాట, సాహిత్యం ద్వారా తెలంగాణ సమాజాన్ని నిత్యం చైతన్య పరిచిన వైతాళికుడు కాళోజి అని కేసీఆర్ కొనియాడారు.