బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 13:07:02

పోలీసు అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్ ఘ‌న నివాళి

పోలీసు అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్ ఘ‌న నివాళి

హైద‌రాబాద్ : ‌పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా విధి నిర్వ‌హ‌ణ‌లో అమ‌రులైన పోలీసుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న‌ నివాళుల‌ర్పించారు. పోలీసుల సేవ‌ల‌ను, త్యాగాల‌ను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు, ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే పోలీసుల అత్యున్న‌త త్యాగాల‌ను ఈ దేశం, ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు అని పేర్కొన్నారు. పోలీసు అమ‌ర‌వీరుల ఆశ‌యాల కోసం పోలీసు ద‌ళాలు పున‌రంకితం కావాల‌న్నారు. పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.