మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 21:25:08

వ్య‌వ‌సాయ‌శాఖ‌లో ఖాళీల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశం

వ్య‌వ‌సాయ‌శాఖ‌లో ఖాళీల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశం

హైద‌రాబాద్ : వ్యవసాయశాఖలో ఉన్న ఖాళీల‌న్నింటినీ త‌క్ష‌ణ‌మే భర్తీచేయాలని రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి, ఉన్న‌తాధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. శాఖాప‌ర‌మైన ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌న్నారు. ప్రమోషన్లు పెండింగులో ఉంటే వెంటనే క్లియ‌ర్ చేయాల్సిందిగా సూచించారు.

భార్యాభర్తలు ఇద్ధరూ ఉద్యోగులే అయితే ఒకేచోట పనిచేసేలా వారికి అవకాశాలు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేయాల‌న్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవ స‌త్కారాల‌తో ఇంటికి సాధ‌రంగా సాగనంపాలన్నారు. వ్యవసాయశాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి సంక్షేమం కోసం ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. వ్యవసాయశాఖ ఇకనుంచి సాదాసీదా డిపార్టుమెంట్‌గా ఉండ‌బోద‌ని చాలా డైనమిక్ డిపార్ట్‌మెంట్‌గా మార‌బోతున్న‌ట్లు ఈ మేర‌కు అధికారులు సంసిద్ధులై ఉండాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 


logo