గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 20:38:22

కారుణ్య నియామ‌కాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్‌ ఆదేశం

కారుణ్య నియామ‌కాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైద‌రాబాద్ : కారుణ్య నియామ‌కాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరమ‌ని సీఎం అన్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప‌రిస్థితులు ఉండొద్ద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.


logo