శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 15:09:11

అతి త్వ‌ర‌లో వీఆర్‌వోల స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాం : ‌సీఎం కేసీఆర్

అతి త్వ‌ర‌లో వీఆర్‌వోల స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాం : ‌సీఎం కేసీఆర్

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : తెలంగాణ‌లో అతి త్వ‌ర‌లో వీఆర్‌వోల స‌మ‌స్యను ప‌రిష్క‌రిస్తాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వివిధ శాఖ‌ల్లో ఉన్న ఖాళీల్లో వీఆర్‌వోల‌ను స‌ర్దుబాటు చేస్తాం. వీఆర్‌వోలపై కొన్ని మీడియా సంస్థ‌లు, కొంద‌రు నాయ‌కులు సానుభూతి చూపిస్తున్నారు. వీఆర్వోల‌ను బ‌జార్ల ప‌డేస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం. వీఆర్‌వోలు ఎవ‌రూ బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు అని సీఎం స్ప‌ష్టం చేశారు.