శనివారం 06 జూన్ 2020
Telangana - May 21, 2020 , 15:46:42

ఐటీ శాఖను అభినందించిన సీఎం కేసీఆర్‌

ఐటీ శాఖను అభినందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల వృద్ధిపై ముఖ్యమ్రంతి కేసీఆర్‌ ఐటీ శాఖను అభినందించారు. భారతదేశంలో తెలంగాణ ఎగుమతుల వాటా 10.6 శాతం నుంచి 11.6 శాతానికి పెరిగిందని సీఎం తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ ఎగుమతుల వృద్ధి 17.93 శాతంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది జాతీయ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.5 శాతంగా ఉందన్నారు. కరోనా నేపథ్యంలో ఐటీ పరిశ్రమ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. logo