ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 14:53:39

'కేసీఆర్ బ‌తికున్నంత వ‌ర‌కు రైతుబంధు ఆగ‌దు'

'కేసీఆర్ బ‌తికున్నంత వ‌ర‌కు రైతుబంధు ఆగ‌దు'

మేడ్చ‌ల్ : రాష్ర్టంలో కేసీఆర్ బ‌తికున్నంత వ‌ర‌కు ఎవ‌డు అడ్డ‌మొచ్చినా.. రైతుబంధు ప‌థ‌కం ఆగ‌దు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రైతులు వాళ్ల అప్పులుక‌ట్టి సొంత పెట్టుబ‌డి జేబుల్లోకి రావాల‌న్న‌దే త‌న కోరిక అని సీఎం ఉద్ఘాటించారు. క‌రోనా వ‌చ్చి రాష్ర్ట ఆదాయం పూర్తిగా ప‌డిపోయింది. కేంద్రం నుంచి జీఎస్టీ కింద వ‌చ్చే డ‌బ్బులు కూడా ఆగిపోయాయి. అయిన‌ప్ప‌టికీ సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాలు ఆగ‌లేదు. రైతుబీమా, రైతుబంధు ప‌థ‌కాల‌కు డ‌బ్బులు పంపిణీ చేశామ‌న్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ 48 గంట‌ల్లో 58 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లోకి న‌గ‌దు జ‌మ చేశామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు బాగుప‌డుతున్నారు. ఉచిత క‌రెంట్ ఇవ్వ‌డం, వ‌ర్షాలు ప‌డ‌డంతో రైతులు తేట ప‌డుతున్నార‌ని చెప్పారు. రైతుకు బాకీల‌న్ని తీరిపోయి.. కొంత డ‌బ్బు జేబులో ఉన్న‌ప్పుడే బంగారు తెలంగాణ సాధ్య‌మైన‌ట్లు అని సీఎం తెలిపారు.