మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 16:41:09

స‌మ‌గ్ర స‌ర్వేతోనే భూ వివాదాల‌కు ప‌రిష్కారం : సీఎం కేసీఆర్

స‌మ‌గ్ర స‌ర్వేతోనే భూ వివాదాల‌కు ప‌రిష్కారం : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : రాష్ర్టంలో భూ వివాదాలకు స‌మ‌గ్ర స‌ర్వేతోనే శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. 99 శాతం స‌మ‌స్య‌ల‌కు స‌ర్వేనే ప‌రిష్కారం చెబుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం గ‌తంలో అవ‌లంభించిన భూ విధానం అశాస్ర్తీయంగా ఉంది. గ‌త ప్ర‌భుత్వాల పాల‌న‌లో ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ప‌ట్టాలు ఇచ్చే వారు. స్థ‌లాలు చూప‌కుండానే ప‌ట్టాలు పంపిణీ చేశారు. హ‌ద్దులు చూప‌కుండా భూముల ప‌ట్టాలు ఇచ్చి స‌మ‌స్యలు సృష్టించారు. పంచిన భూమి త‌క్కువ‌.. పంపిణీ కాగితాలే ఎక్కువ అని సీఎం తెలిపారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాల‌కులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హిస్తే నేరం అవుతుంద‌న్నారు. గ‌త పాల‌కులు అనేక స‌మ‌స్య‌ల‌ను సృష్టించి పోయారు. అన్ని స‌మ‌స్య‌ల‌కు ఒకేసారి ప‌రిష్కారం కావాలంటే కాదు.. ఒక్కొక్క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటూ పోతున్నాం. కార‌ణాలు ఏమైనా లోపాలు, లొసుగులు ఉన్నాయి. ఈ లొసుగులు, లోపాల‌కు ఈ చ‌ట్టంతో చెక్ పెడుతామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. 


logo