ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 12:41:55

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మాతంగి అంత్య‌క్రియ‌లు

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మాతంగి అంత్య‌క్రియ‌లు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి మాతంగి నర్సయ్య అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని, సంబంధిత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.  ఈ మేర‌కు మాతంగి అంత్య‌క్రియ‌ల‌ను అధికారిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ‌త కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న న‌ర్స‌య్య.. హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. న‌ర్స‌య్య మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడరాం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి నర్సయ్య చేసిన కృషిని గుర్తు చేశారు.  


logo