గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 13:48:58

ధ‌ర‌ణి భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ : ‌సీఎం కేసీఆర్

ధ‌ర‌ణి భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ : ‌సీఎం కేసీఆర్

మేడ్చ‌ల్ : రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ భార‌త‌దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్ అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల బ‌తుకంతా భూమి చుట్టూ ఉండేది. ఒక‌ప్పుడు భూమికి ప్రాధాన్య‌త ఉండేది కాదు. కానీ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో, నిర్ణీత ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం చేయ‌డం నేర్చుకున్న త‌ర్వాత భూమికి విలువ పెరిగింది. గ‌త పాల‌కులు రెవెన్యూ చ‌ట్టాలు, భూ విధానాల‌కు శ్రీకారం చుట్టారు. కొన్ని ఫ‌లితాలు ఇచ్చాయి. కొన్ని విక‌టించాయి. కొన్ని ప్ర‌జ‌ల‌కు లాభం క‌లిగించాయి. ఇబ్బందులు క‌లిగించాయి. వాట‌న్నింటికీ శాశ్వ‌త నివార‌ణ కావాల‌ని, తెలంగాణ రైతాంగం ఎలాంటి అటుపోట్ల‌కు గురికావొద్ద‌నే ఉద్దేశంతోనే కొత్త రెవెన్యూ చ‌ట్టం కోసం నిర్ణ‌యం తీసుకున్నాం. ఒక త‌ప్పు జ‌రిగితే అనేక త‌రాలు ఇబ్బంది పడుతాయి. త‌ప్ప‌ట‌డుగులు లేకుండా స‌రైన పంథాలో ముందుకెళ్లాల‌ని క‌ఠినమైన నిర్ణ‌యం తీసుకున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. 

‘‘ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమే. సాగువిధానంలో అధునాతన మార్పులు వచ్చి ఆస్తిగా మారింది. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్‌ రూపకల్పన చేశాం. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా వారి భూముల వివరాలు ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. ధరణి పోర్టల్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదు. తప్పు చేసే అధికారం నాకులేదు. ఒక తప్పు జరిగితే భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడతాయి. తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాం. మీ-సేవ, ధరణి పోర్టల్‌, వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లి భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ధరణి పోర్టల్‌ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నమూనా పత్రాల ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేసుకోవచ్చు’’ అని సీఎం వివరించారు.

మూడుచింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ వీరారెడ్డి 1969లో రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారిలో అగ్రణ్యులని గుర్తు చేశారు. ఆ మహనీయుడు పుట్టిన గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడి జైలుపాలైన వ్యక్తుల్లో వీరారెడ్డి ఒకరు’’ అని కేసీఆర్ వివరించారు.