శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 15:48:42

ద‌ళితుల కోసం ద‌ళిత చైత‌న్య జ్యోతి : ‌సీఎం కేసీఆర్

ద‌ళితుల కోసం ద‌ళిత చైత‌న్య జ్యోతి : ‌సీఎం కేసీఆర్

జ‌న‌గామ : రాష్ర్టంలోని అన్ని వ‌ర్గాల‌ను బాగు చేసుకుంటున్నాం.. ద‌ళిత వ‌ర్గాల‌ను కూడా బాగు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. కొడకండ్ల రైతు వేదిక ప్రారంభం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం మాట్లాడుతూ.. వ్య‌వ‌సాయ రంగాన్ని బాగు చేసుకుంటున్నాం. గొర్రె కాప‌రుల‌ను, గీతకార్మికుల‌ను, మ‌త్స్య‌కారుల‌ను కూడా బాగు చేసుకుంటున్నాం. చేనేత కార్మికుల‌ను ఆదుకుంటున్నామ‌ని తెలిపారు. ఈ ర‌కంగా ప్ర‌తి ఒక్క‌ర్ని కాపాడుకుంటున్నాం. ద‌ళితుల‌ది కూడా ఛాలెంజ్ ఉంది. ద‌ళితులు బాధ‌లు అనుభివిస్తున్నారు. సామాజిక వివ‌క్ష‌కు గుర‌వుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల‌ను బాగు చేసుకోవాలి. మ‌న ద‌ళిత‌, గిరిజ‌న వ‌ర్గాలు పైకి రావాలి. ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టాం. గురుకుల పాఠ‌శాల‌లు పెట్టి ఆ పిల్ల‌ల‌ను చ‌దివిస్తున్నాం. ఇంకా చ‌దివించాలి. ఆ వ‌ర్గాల కోసం ద‌ళిత చైత‌న్య జ్యోతి అనే ఓ కార్య‌క్ర‌మం తేవాల‌ని ఆలోచ‌న ఉంది. త్వ‌ర‌లోనే ఆ విష‌యాలు వెల్ల‌డిస్తాం. కులం, మ‌తం జాతి లేదు. నాలుగు కోట్ల మంది మ‌నోళ్లే. కంటి నిండా నిద్ర పోయే తెలంగాణ రావాలి. తెలంగాణ రైతాంగం దేశానికి దిక్సూచి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.