గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 13, 2020 , 13:22:35

యాదాద్రీశునికి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు

యాదాద్రీశునికి సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు

యాదాద్రి: సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. ఆల‌య అర్చ‌కులు సీఎం కేసీఆర్‌కు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. యాదాద్రి ల‌క్ష్మీనార‌సింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. సీఎం కేసీఆర్‌కు అర్చ‌కులు చ‌తుర్వేద ఆశీర్వ‌చనం అందించారు. సీఎం వెంట మంత్రులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత‌, ఎంపీ సంతోశ్ కుమార్‌, ఇత‌ర‌ నేత‌లు, అధికారులు ఉన్నారు. పూజానంత‌రం ఆల‌య పునరుద్ధ‌ర‌ణ‌ ప‌నులను సీఎం ప‌రిశీలిస్తున్నారు. ప‌నుల‌కు సంబంధించి ఆల‌య ఈవో గీత‌, స్థ‌ప‌తి ఆనంద సాయి సీఎం కేసీఆర్‌కు వివ‌రిస్తున్నారు. అనంత‌రం ప‌నుల పురోగ‌తిపై ఆల‌య అధికారుల‌తో స‌మీక్ష జ‌ర‌ప‌నున్నారు. ప‌నుల తీరుపై అధికారుల‌కు స‌ల‌హాలు, సూచ‌నలు ఇవ్వ‌నున్నారు.


logo