శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 13:33:38

డాక్ట‌ర్ బీఎస్ బ‌జాజ్ మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

డాక్ట‌ర్ బీఎస్ బ‌జాజ్ మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో బ‌యోటెక్ ఇండ‌స్ట్రీ ఆద్యుడు డాక్ట‌ర్ బీఎస్ బ‌జాజ్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 93 ఏళ్లు.  బ‌యోటెక్ ప‌రిశ్ర‌మ‌ల‌కు డాక్ట‌ర్‌ బీఎస్ బ‌జాజ్ చేసిన సేవ‌ల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.  ఏషియ‌న్ బ‌యోటెక్ అసోసియేష‌న్స్ వ్య‌వ‌స్థాప‌క ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బ‌జాజ్ చేసిన సేవ‌ల్ని సీఎం కేసీఆర్ కొనియాడారు.  జీనోమ్ వ్యాలీ, బ‌యో ఏషియాను వాస్త‌విక రూపంలోకి తీసుకురావ‌డంలో డాక్ట‌ర్ బీఎస్ బ‌జాజ్ విశేష కృషి చేసిన‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎంవో త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. 

గ‌త ఏడాది జ‌రిగిన బ‌యో ఏషియా స‌ద‌స్సులో డాక్ట‌ర్ బ‌జాజ్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు అంద‌జేసిన‌ట్లు కూడా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. డాక్ట‌ర్ బ‌జాజ్ మృతిప‌ట్ల ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు కేసీఆర్ సంతాపం తెలిపారు. 


తాజావార్తలు


logo