గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 14:36:52

టీఆర్ఎస్ ఎంపీల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

టీఆర్ఎస్ ఎంపీల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

హైద‌రాబాద్ : ప‌్ర‌గ‌తి భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎంపీల‌తో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎంపీల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. 

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం వైఖరి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల్లో రాష్ట్ర విధానం, జీఎస్టీ విషయంలో కేంద్రం తీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 14 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.


logo