మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 14:58:53

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. గవర్నర్‌ను సీఎం కేసీఆర్‌ కలిసి బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్‌ దృష్టికి సీఎం కేసీఆర్‌ తీసుకెళ్లారు. 

శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ప్రసంగించిన తర్వాత బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో ఖరారుచేస్తారు. logo