శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 02:48:31

రేపటి నుంచి బడ్జెట్‌ అసెంబ్లీ

రేపటి నుంచి బడ్జెట్‌ అసెంబ్లీ
  • ప్రగతిభవన్‌లో ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష
  • ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించండి
  • గవర్నర్‌ తమిళిసైకి సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానం
  • బడ్జెట్‌ ప్రసంగ ప్రతి గవర్నర్‌కు అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శుక్రవారం (ఈ నెల 6వ తేదీ) నుంచి ప్రారంభంకానున్న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకావాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు శాసనసభలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాలని కోరారు. ఈ మేరకు బుధవారం రాజ్‌భవన్‌లో తమిళిసై సౌందర్‌రాజన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. మంత్రివర్గం ఆమోదించిన బడ్జెట్‌ ప్రసంగ ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. రాష్ట్రంలో కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్టు గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.


అంతకుముందు వార్షిక బడ్జెట్‌పై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


logo