శనివారం 29 ఫిబ్రవరి 2020
'ఏయ్ సంపత్‌ ఇట్రా'.. ఇదో ఆత్మీయ సన్నివేశం

'ఏయ్ సంపత్‌ ఇట్రా'.. ఇదో ఆత్మీయ సన్నివేశం

Feb 14, 2020 , 17:58:35
PRINT
'ఏయ్  సంపత్‌ ఇట్రా'.. ఇదో ఆత్మీయ సన్నివేశం

కేసీఆర్-గంగుల మధ్య ఉన్న వ్యక్తి అచ్ఛం సూపర్ స్టార్ రజినీకాంత్ లా లేడు...

ఆయన రజినీకాంతే అనుకుంటే మీరు నిప్పులో కాలేసినట్టే...


ఇదీ అసలు విషయం....

"ఏయ్ సంపత్‌ ఇట్రా.. 

ఆయన మా దోస్తయా, ఆయనను జర రానీయిండ్రి"

రోప్ పార్టీ సెక్యూరిటీ నడుమ హెలీప్యాడ్ నుండి కలెక్టరేట్‌కు నడుచుకుంటు పోయెటప్పుడు సిఎం కెసిఆర్ అక్కడ జనాల్లో ఉన్న చిన్నప్పటి దోస్తు సంపత్‌ను గుర్తుపట్టడం... రావడానికి అనుమతించుమని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించడం... సిఎంతో కలిసి నడుస్తూ ప్రపంచాన్ని జయించానన్నంత ఆనందంలో సంపత్‌ రాజసం...   ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్‌ పర్యటనలో ఆవిష్కృతమైన అరుదైన, ఆత్మీయ సన్నివేశం ????

(ధాము నర్మాల, సతీష్‌ గడ్డమ్‌ ఫేస్‌బుక్‌ పేజీ నుంచి)


కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును పలువురు ప్రముఖులు గురువారం ఆత్మీయంగా పలుకరించారు. బుధవారం రాత్రి నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌లో బస చేశారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి వెంట మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, నగర మేయర్‌ సునీల్‌రావు ఉండగా, ఎంఎఫ్‌సీ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌ సీఎంకు దట్టీ కట్టారు. డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి, కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రముఖులు ముఖ్యమంత్రికి మొక్కలు అందించారు. సాయంత్రం కాళేశ్వరం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్‌కు కలెక్టరేట్‌ హెలీప్యాడ్‌ వద్ద కలెక్టర్‌ శశాంక, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి సమీక్ష సమావేశం కోసం వెళ్తున్న క్రమంలో దారిలో పలువురు ఇచ్చిన వినతిపత్రాలను ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ చిన్నారిని ఎత్తుకున్నారు. తనను కలిసేందుకు ప్రయత్నిస్తున్న మానకొండూర్‌ మండలం కొండపల్కలకు చెందిన సంపత్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ గమనించి దగ్గరికి పిలిపించుకున్నారు. దీంతో ఆయన సీఎం పక్కనే నడిచారు. అనంతరం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.


logo