శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 12:34:17

7న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

7న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల నిర్వ‌హణ‌తోపాటు ఇత‌ర అంశాల‌పై సీఎం కేసీఆర్ ఈ నెల 7న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో విస్తృత‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. బుధ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌వ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా శాంతిభ‌ద్ర‌త‌లు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, అడ‌వుల సంర‌క్ష‌ణ‌, గంజాయి, మాద‌కద్రవ్యాల నియంత్ర‌ణ‌, క‌ల‌ప స్మ‌గ్లింగ్ అరిక‌ట్ట‌డంపై చ‌ర్చించ‌నున్నారు. ఈస‌మావేశానికి హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ, అట‌వీశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఆయా శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌రుకానున్నారు.