బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:39

గ్రేటర్‌ మనదే రెండు ఎమ్మెల్సీలు కూడా..

గ్రేటర్‌ మనదే రెండు ఎమ్మెల్సీలు కూడా..

ఎన్నిక ఏదైనప్పటికీ సీరియస్‌గా తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రజా ప్రతిని ధులకు సూచించారు. చిన్నదైనా, పెద్దదైనా.. ఎన్నికను సీరియస్‌గా తీసుకొని పనిచేయాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 104 సీట్లు గెలుస్తుందని పలుసర్వేల్లో వెల్లడైందన్నారు. టీఆర్‌ఎస్‌కు 60 లక్షల సభ్యత్వం ఉన్నదని, వీరిలో లక్షల మంది డిగ్రీ పూర్తిచేసిన వారున్నారని, వారందరినీ గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా నమోదుచేసి, ఓటుహక్కు వినియోగించుకునేలాచేస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్‌ఎస్‌  అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ సభ్యత్వం పొందిన వారి పేర్లను ఆదివారం సాయంత్రంకల్లా అందిస్తామని, అర్హులైనవారి పేర్లను నమోదుచేయించాలని సూచించారు. పార్టీ ఇప్పటివరకు అనేక ఎన్నికలను ఎదుర్కొన్నదని, ప్రజలు మనవైపు ఉన్నారని, వారి ఆశీస్సులు ఇదేవిధంగా ఉండేలా అందరం పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ క్రమశిక్షణ గల పార్టీ అని గుర్తుచేశారు.   దుబ్బాక ఉప ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు గ్రామస్థాయి వరకు నెట్‌వర్క్‌ ఉన్నదని, అందువల్లే టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. వరంగల్‌, ఖమ్మం నగరాల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపని సీఎం కేసీఆర్‌ చెప్పారు.logo