శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 14:59:57

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌ : ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఉన్నతాధికారులు, టీజీవో, టీఎన్‌జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల డైరీలను ఆవిష్కరించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీకి దాదాపు 200 మంది ఉద్యోగులు, అధికారులు హాజరయ్యారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించినట్లుగా సమాచారం. పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలన్నీ ఫిబ్రవరి చివరికల్లా పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. 


logo