ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 06, 2020 , 12:02:57

సమైక్య దీప్తి.. భారతీయ స్ఫూర్తి

సమైక్య దీప్తి.. భారతీయ స్ఫూర్తి

స్ఫూర్తి దీపం వెలిగింది.. వెల్లువెత్తిన సమైక్యతా భావన వెలుగు దివిటీ పట్టింది. ప్రపంచాన్ని కకావికలంచేస్తున్న కరోనావైరస్‌పై సమరంలో ఒక్కతాటిపై ఉన్నానని యావత్‌ భారతావని దిగంతాలకు చాటిచెప్పింది. ప్రజారోగ్యం కోసం దేశవ్యాప్తంగా అహర్నిశలు పనిచేస్తున్న వైద్యసిబ్బందికి ఘనంగా సంఘీభావం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు చిట్టిచేతుల చిన్నారులు మొదలుకుని బాధ్యతాయుత పౌరులు.. దేశనేతల దాకా అందరూ తొమ్మిది నిమిషాలపాటు వెలిగించిన దీపశిఖలు.. రక్కసి వైరస్‌పై సమరంలో సమిష్టితత్వాన్ని ప్రదర్శించాయి. కొందరు ఔత్సాహికులు పటాకులు కాల్చి వెలుగుపూలుజల్లారు. ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు దీపాలు వెలిగించగా.. ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో కొవ్వొత్తులు చేబూని సంఘీభావం ప్రకటించారు.

logo