మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 16:19:09

తెలంగాణను అగ్రగామిగా నిలిపిన సీఎం : అక్బరుద్దీన్‌ ఓవైసీ

తెలంగాణను అగ్రగామిగా నిలిపిన సీఎం : అక్బరుద్దీన్‌ ఓవైసీ

హైదరాబాద్‌ : ఆరేళ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. బడ్జెట్‌ పద్దులపై శాసనసభలో నేడు చర్చ మొదలైంది. సంక్షేమ పద్దులపై మొదటిరోజు చర్చను చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా-శిశు సంక్షేమ, గృహనిర్మాణశాఖల పద్దులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌ సభ్యుడు పొదెం వీరయ్య పద్దులపై చర్చను ప్రారంభించారు. 

చర్చ సందర్భంగా అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. పేదల కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారన్నారు. మైనార్టీల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఇన్ని మంచి పనులు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్‌ గుడ్డిగా విమర్శిస్తున్నాయన్నారు. వక్ఫ్‌ బోర్డు నియామకాల్లో అక్రమాలకు అడ్డుకట్టవేయాలని కోరారు. వక్ఫ్‌ బోర్డుకు చెందిన వందలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. మైనార్టీ సంక్షేమానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.36 కోట్ల కోసం పోరాడినం. అదే టీఆర్‌ఎస్‌ హయాంలో రూ.1500 కోట్లకు పైగా నిధులు కేటాయించారని పేర్కొన్నారు.


logo
>>>>>>