మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 17, 2020 , 13:34:24

సీఎం కేసీఆర్‌ తెలంగాణకు శ్రీరామరక్ష: మంత్రి జగదీష్‌ రెడ్డి

సీఎం కేసీఆర్‌ తెలంగాణకు శ్రీరామరక్ష: మంత్రి జగదీష్‌ రెడ్డి

సూర్యాపేట : సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును సూర్యాపేట నియోజకవర్గవాసులు వేడుకగా జరుపుకున్నారు. సీఎం మానసపుత్రిక హరితహారంలో భాగంగా మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి 6,600 మొక్కలు నాటారు. టేకుమట్ల నుంచి సోలిపేట మూసి ప్రాజెక్ట్‌ వరకు 12 కిలోమీటర్ల మేర ఒకసారి 6,600 మొక్కలు నాటారు. టేకుమట్ల, సోలిపేట, రామారం, రత్నపురం, రామచంద్రాపురం, ఎండ్లపల్లి గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరి ఆశీస్సులతో సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్థిల్లాలన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మరింత పురోగమించాలన్నారు. సూర్యాపేట జిల్లా ప్రజల చిరకాల స్వప్నం గోదావరి జలాలు జిల్లాను తాకాయన్నారు. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. సూర్యాపేట జిల్లా ప్రజలు జన్మజన్మలకు కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. కేసీఆర్‌ దార్శనీయత, విజన్‌ను యావత్‌ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 


logo