సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 13:36:39

సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి : ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి : ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

మంచిర్యాల : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ అన్నారు. మంచిర్యాల జిల్లా కొటపల్లి మండలం పంగిడిసోమారం గ్రామానికి చెందిన పొసక్కకు సీఎం సహాయనిధి నుండి మంజూరైన రూ. 25 వేల చెక్కును ఎమ్మెల్సీ లబ్దిదారుడికి నేడు అందజేశారు. ఈ సందర్భంగా పురాణం సతీష్‌ మాట్లాడుతూ...

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టే ప్రతి పథకం పేదలకు అందాలని తపన ఉంటుందన్నారు. గతంలో బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరగాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. లబ్దిదారులకే నేరుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.


logo