గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 14:51:35

దొడ్డి కొమురయ్య ఆశయ సాధనలో సీఎం కేసీఆర్‌ : ఎమ్మెల్యేలు కంచర్ల, నోముల

దొడ్డి కొమురయ్య ఆశయ సాధనలో సీఎం కేసీఆర్‌ : ఎమ్మెల్యేలు కంచర్ల, నోముల

నల్లగొండ : తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ యోధుడు దొడ్డి కొమురయ్య వర్థంతి నేడు. దొడ్డి కొమురయ్య వర్థంతి వేడుకలను నల్లగొండలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లో ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహయ్య పూలమాలలేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు స్పందిస్తూ... దొడ్డి కొమురయ్య ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు.

రైతుల కష్టాలను దూరం చేసేందుకు నాడు కొమురయ్య పోరాటం చేశారన్నారు. కాగా నేడు తెలంగాణలో సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలతో రైతాంగం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్దన్‌ యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పంకజ్‌ యాదవ్‌, పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.


logo