శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:31

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం

  • కర్నల్‌ కుటుంబానికి అండగా నిలువడం హర్షణీయం 
  • కేంద్రం, ఇతర రాష్ర్టాలు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి 
  • కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అండగా నిలువడంపై కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు సోమవారం ట్వీట్‌చేశారు. ‘కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి గ్రూప్‌-1 అధికారిగా నియమితులు కావడం హర్షణీయం. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న చొరవను కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలి. సంతోష్‌బాబు మరణంతో తల్లడిల్లుతున్న ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆయన సత్వరం చర్యలు తీసుకున్నారు. అందరూ దీనిని ఒక ఉదాహరణగా తీసుకోవాలి’ అని సింఘ్వీ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్‌ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కవిత రీ ట్వీట్‌చేశారు.


logo