ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 16:22:03

సీఎం కేసీఆర్ సహకారంతోనే రహదారులకు మహర్దశ : మంత్రి జగదీశ్ రెడ్డి

సీఎం కేసీఆర్ సహకారంతోనే   రహదారులకు మహర్దశ : మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సూర్యపేట నియోజకవర్గంలో రహదారులకు మహర్దశ పట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం అనంతారం, దోస పహాడ్,  దుబ్బగూడెం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన చెప్పారు. పెన్ పహాడ్ నుంచి అనంతారం మీదుగా దోసపహాడ్ అటు నుంచి దుబ్బగూడెం వరకు రూ. 6.23 కోట్లతో నిర్మించ తలపెట్టిన బిటి రోడ్ నిర్మాణపు పనులకు మంత్రి  శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై ఎంతో మంది గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లుగా పరుగులు పెట్టిస్తోన్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన కొనియాడారు. 


సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో మంత్రి జగదీష్ రెడ్డి జరిపిన సుడిగాలి పర్యటన లో భాగంగా ఆత్మకూర్ యస్ మండల పరిధిలోని దాచారం, ఏపూర్ మీదుగా కూడలి నుండి వయా మక్తాపూర్ వరకు రూ. 207.05 లక్షలతో నిర్మించ తకపెట్టిన బీటీ రోడ్ తో పాటు సూర్యాపేట మండలం యాండ్లపల్లి  సఫావత్ తండా రేక్యాతాండలను కలుపుతూ రూ. 242.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్ నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అదే విధంగా రూ. 19.08 లక్షల అంచనా వ్యయంతో జరుప తలపెట్టిన మూసీ ఎడమ కాలువ డిస్ట్రిబ్యూటర్-14 మరమ్మతులతో పాటు పునరుద్ధరణ పనులకు కాసరాబాద్ వద్ద  మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.


logo