ఆదివారం 24 జనవరి 2021
Telangana - Nov 27, 2020 , 12:41:38

సీఎం కేసీఆర్ ముందు చూపు ఉన్న నాయకుడు : మంత్రి కొప్పుల

సీఎం కేసీఆర్ ముందు చూపు ఉన్న నాయకుడు : మంత్రి కొప్పుల

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ ముందు చూపు ఉన్న నాయకుడని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బిషప్‌లు, పాస్టర్లు, క్రిస్టియన్ మత ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత  కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఒక్క తాటిపై తీసుకొచ్చారన్నారు.

క్రిస్టియన్ మత పెద్దలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిని కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. శాంతికి భంగం కలిగించే శక్తుల పట్ల మనమందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు కేసీఆర్,కేటీఆర్,ఈశ్వర్ పది కాలాల పాటు ప్రజా సేవకు అంకితం కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ప్రార్థన చేశారు. 


logo