గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 14:22:43

కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్న సీఎం కేసీఆర్

కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తున్న సీఎం కేసీఆర్

రంగారెడ్డి  : రాష్ట్రంలో కుల వృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగ జిల్లాలోని నందిగామ మండలం చేగూరు గ్రామంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 4 వేల ఈత మొక్కలను మంత్రి, స్థానిక పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో కులవృత్తులు చేసుకునే వారు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు అంజయ్య యాదవ్, స్థానిక మండల  ప్రజా పరిషత్ అధ్యక్షులు మంచన్ పల్లి ప్రియాంక శివశంకర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ వై ఖురేషీ, రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.


logo