సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను నిర్మించే విషయమై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో బుధవారం సమావేశం జరిగింది. హోం మంత్రి, పశుసంవర్ధక శాఖల మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి కొప్పుల ముస్లిం మత ప్రతినిధులు, క్రిస్టియన్, హిందూ మతాల ప్రతినిధులు, సెక్రటేరియట్ ఉద్యోగులతో చర్చించారు.
కొత్తగా కడుతున్న సచివాలయంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణ ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు వెల్లడించారు. సచివాలయంతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా సకాలంలో పూర్తవుతాయని మంత్రులు స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు. సీఎం కేసీఆర్ నిబద్ధత, అంకితభావం పట్ల తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రార్థనా మందిరాలను సకాలంలో నిర్మిస్తారన్న నమ్మకంతో ఉన్నామని మూడు మతాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్ పోచారం
తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
తాజావార్తలు
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
- ఫలక్‌నుమా ఆర్ఓబీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
- ఉద్యోగ అవకాశాలు కల్పించేది టీఆర్ఎస్సే..
- దోమల నివారణకు చర్యలు
- వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
- కార్యకర్తలే పార్టీకి పునాదులు
- స్వయం ఉపాధి.. మహిళలకు భరోసా