ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 15:05:57

సీఎం కేసీఆర్ గొప్ప సంస్కరణవాది : మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ గొప్ప సంస్కరణవాది : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ : సీఎం కేసీఆర్ గొప్ప సంస్కరణవాది. ప్రజలకు ఏది అవసరమో అదే చేసి చూపిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి పాల్గొని ట్రాక్టర్ నడిపారు. ఐనవోలు క్రాస్ రోడ్ నుంచి వర్ధన్నపేట వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం రైతుల పాలిట వరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు పూర్తిగా రైతు వ్యతిరేకమని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా.. కనీసం అవార్డులు ఇచ్చి ప్రశంసించడం సంతోషకరమన్నారు. అలాగే వ్యవసాయేతర భూములను క్రమబద్ధీకరణ చేయడం ద్వారా ప్రజల ఆస్తులు, భూములకు పూర్తి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు. logo