సోమవారం 01 జూన్ 2020
Telangana - May 22, 2020 , 10:14:33

వలసకార్మికులు న‌డుచుకుంటూ వెళ్లొద్దు..

వలసకార్మికులు న‌డుచుకుంటూ వెళ్లొద్దు..


హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కాలినడకన తన సొంత రాష్ర్టానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వలస కార్మికులు తమ సొంత ప్రాంతానికి పోవడానికి అవసరమైన రైళ్లు సమకూర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. రైళ్లు లేని ప్రాంతాల నుంచి అవసరమైతే బస్సుల ద్వారా తరలించాలన్నారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలని కోరుకొనే వలస కార్మికులెవరూ నడిచిపోవాలనే ఆలోచన చేయవద్దని, తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని తమ సొంత ప్రాంతాలకు తరలిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.   


logo