న్యూఢిల్లీ, జూన్ 9: గురువారం వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనున్నది. భూమి నుంచి చంద్రుడు దూరంగా ఉన్న కారణంగా ఆ సమయంలో చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. సూర్యుడిని పూర్తిగా కప్పిఉంచకపోవడం వల్ల చంద్రుడి చుట్టూ వలయాకారంలో ప్రకాశవంతంగా కాంతి కనిపిస్తుంది. భారత్‌లో లఢక్, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సూర్యాస్తమయానికి ముందు దీనిని చూడవచ్చు.