శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 14:47:21

సబ్బండ వర్ణాలకు అండగా సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

సబ్బండ వర్ణాలకు అండగా సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ అర్బన్ : దేశ చరిత్రలో ఇప్పటివరకు ముదిరాజ్‌లకు ఆత్మ గౌరవం కల్పించిన ఘనత కేవలం సీఎం కేసీఅర్‌కు మాత్రమే దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల సోమిడి చెరువులో ఆదివారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాష్, మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులతో కలిసి చెరువులో చేపపిల్లలను వదిలారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు ముదిరాజ్‌లను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాకనే ప్రతి కులానికి సముచిత గౌరవం కల్పించారన్నారు. 60 ఏండ్లు అణచబడ్డ తెలంగాణ స్వరాష్ట్రం సాధించినంక బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. ముదిరాజ్‌లు ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసి పారిశ్రామికవేత్త లుగా ఎదగాలన్నారు.

చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తీవ్రంగా అణచబడ్డ ముదిరాజ్‌లు ఇప్పుడు స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అంటే కేవలం కేసీఅర్ వల్లే నని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.


logo