శనివారం 06 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:56:03

తక్షణ స్పందన.. సత్వర చర్యలు

తక్షణ స్పందన.. సత్వర చర్యలు

  • కరోనా వ్యాప్తినిరోధంపై అప్రమత్తంగా ఉండాలి
  • ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • కరోనా కేసులు 40263
  • దేశంలో ఒక్క రోజే 2,487 కేసులు.. 83 మృతులు
  • కేసుల రెట్టింపు వ్యవధి 12 రోజులకు
  • కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడి
  • ఇతర దేశాలకన్నా మన దేశంలోనే మృతులు తక్కువ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వైరస్‌ సోకినవారు కలిసినవారందరి పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. వైరస్‌ వ్యాప్తి జరుగకుండా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ప్రజలు తప్పక పాటించాలని కోరారు. వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు.

లాక్‌డౌన్‌ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు- రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పరిస్థితి, కంటైన్మెంట్‌ జోన్ల నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్‌ నర్సింగ్‌రావు, శాంతికుమారి, జనార్దన్‌రెడ్డి, రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మొత్తం కేసులు 
1082
ఆదివారం నమోదైన కేసులు
21
మొత్తం కోలుకున్నవారు
545
చికిత్స పొందుతున్నవారు
508
మొత్తం మరణాలు
 29


logo