ఆదివారం 01 నవంబర్ 2020
Telangana - Sep 22, 2020 , 09:26:16

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌ : ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో ఇవాళ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూశాఖకు సంబంధించి ధరణి పోర్టల్‌ను కొత్తగా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం అమలు, విధివిధానాలపై సమావేశంలో సీఎం అధికారులతో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. పట్టణ, పురపాలక పన్నురికార్డులను అనుసంధానం చేసే అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం.  భూదస్త్రాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టడంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.