బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 15:40:10

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌:   ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు  పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని పోలీస్‌ శాఖను కోరారు. ప్రగతి భవన్‌లో   ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, జైళ్ల శాఖ  డీజీ   రాజీవ్ త్రివేది, డీజీపీ  మహేందర్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.  ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు. 


logo