శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 04:45:21

ప్రజలకు సీఎం కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

ప్రజలకు సీఎం కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని అభిలషించారు.

సహజ రంగులతో హోలీ: కేటీఆర్‌ 

హోలీ పండుగను సహజ రంగులతోనే నిర్వహించుకోవాలని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు సూచించారు. ఆయన ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘రసాయనిక రంగులను వదిలేద్దాం. సహజమైన రంగులనే వాడుదాం. రంగుల పండుగను సంబురంగా జరుపుకుందా’మని ట్వీట్‌చేశారు.


logo